20-08-2025 01:23:43 AM
ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘కాంతార: చాప్టర్1’. బాక్‌బస్టర్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. రిషబ్ శెట్టి రచనాదర్శకత్వం వహించి తానే మళ్లీ సెంట్రల్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. మొదటి పార్ట్‌లో ఉన్న యూనివర్స్‌ను ఇంకా విస్తరించనున్న ఈ ప్రీక్వెల్‌లో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పాత్రను కులశేఖరగా పరిచయం చేశారు మేకర్స్. ఈ మేరకు ఆయన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు.
ఈ అనౌన్స్‌మెంట్ ఫ్రాంచైజీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్‌లో అక్టోబర్ 2న విడుదల కానుంది. హోంబాలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అర్వింద్ ఎస్ కాశ్యప్ అందిస్తుండగా, బీ అజనీష్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.