2 July, 2026 | 10:45 PM

శభాష్ సుకృతి

20-08-2025 01:22 AM

ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారం గెలుచుకున్న సుకృతి వేణిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం అభినందించారు. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్‌లో ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి గాను సుకృతి ఉత్తమ బాలనటిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుకృతి తన తల్లిదండ్రులైన సుకుమార్, తబిత దంపతులతో కలిసి సీఎంను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. వారి వెంట చిత్ర నిర్మాతలు వై రవిశంకర్, శేష సింధురావు ఉన్నారు.