calender_icon.png 11 October, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆస్కీ బృందం తనిఖీ

11-10-2025 12:42:10 AM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శుక్రవారం ఆస్కీ బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. బెల్లంపల్లికి మధ్యాహ్నం చేరుకున్న డాక్టర్ దినేష్ బృందం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అస్కీ టీం ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ ప్రకారం అన్ని విభాగాలను సందర్శించింది. ఆసుపత్రిలో అన్ని వార్డులను ఫార్మసీ మందులు అందుబాటు, వైద్య పోస్టుల ఖాళీలు, అందుతున్న సేవలను p పరిశీలించింది. ఉన్నఫలంగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ప్రభుత్వ  ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ జి రవి, స్థానిక ఆస్పత్రి వైద్యులు  మూర్తి, కిరణ్ కుమార్, కిరణ్ కుమార్, సాబీర్, సరిత రాథోడ్, నర్సింగ్ సూపర్డెంట్ జాస్మిన్, ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.