calender_icon.png 27 December, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేలల్లోనే తెల్లబంగారం

27-12-2025 05:19:11 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో పత్తి పంట విరగాసింది. కూలీల కొరతతో పంట చేలన్నీ తెల్ల బంగారం ఎండబోసినట్లుగా కనిపిస్తున్నాయి. అసలే దిగుబడి లేక అన్నదాతలు అవస్థలు పడుతుంటే, కిలోకు రూ.12 ఇస్తేనే వస్తామని కూలీలు అంటున్నారు. మరికొందరు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి పత్తి ఏరుతున్నారు. వాంకిడి కలాన్‌, సోనాపూర్‌, ఆర్లీ, గోయగాం, నార్లాపూర్‌, వాంకిడి ఖుర్దు, కోమటిగూడ, ఖమాన్‌, ఇందాని, బెండర, పేవుట తదితర గ్రామాల్లో పత్తి చేలు తెల్లబోయి కనిపిస్తున్నాయి.