calender_icon.png 27 December, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య పరంగా శారీరకంగా ఫిట్ గా ఉండాలి

27-12-2025 04:56:12 PM

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్,(విజయక్రాంతి): నిత్యజీవితంలో రాజకీయంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఆరోగ్యపరంగా శారీరకంగా ఫిట్ గా ఉండాలని, తాను మర్రి లక్ష్మారెడ్డిని రోల్ మోడల్ గా తీసుకుంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో మా అసోసియేషన్ 12 వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరిచి ఒలంపిక్స్ లో రాష్ట్రం నుండి మెడల్ తెచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రం నుండి అనేక జాతీయ స్థాయి క్రీడలు  హైదరాబాద్ లో ఇతర జిల్లాల్లో జరుగుతున్నాయన్నారు. భవిషత్ లో అథ్లెటిక్స్ మాత్రమే కాదు ప్రతి ఆట లో ఒలంపిక్స్ లో రాష్ట్రం నుండి క్రీడాకారులు ప్రాతినిద్యం వహించాలన్నారు. మీకు ఎక్కడ మ్యాచ్ ఉన్నా నిర్వహణకు ప్రభుత్వంలో ఉన్నవారు మద్దతునిస్తారని, ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు.

స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. అందరికీ శారీరక శ్రమ తక్కువై ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుందని, అందరూ ఉదయం లేవగానే వాకింగ్ ట్రాక్స్ కి వచ్చి ఉదయం నడక ద్వారా శారీరక ఫిట్నెస్ ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అథ్లెటిక్స్ గౌరవ అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి, శ్రీధర్, మర్రి లక్షా రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.