calender_icon.png 11 October, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి

11-10-2025 12:33:09 AM

కేంద్ర ప్రభుత్వం వివక్షత తగదు

ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి        

కామారెడ్డి, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా నాలుగో మహాసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి మెరుగైన సౌకర్యాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఆశ వర్కర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత తగదని అన్నారు. కరోనా కాలంలో ఆశ వర్గాలను ప్రాణాలను తెగించి ప్రజల ప్రాణాలు కాపాడిన ఇట్లు ఆశ వర్కర్లు డబ్ల్యుహెచ్వో సా అనేక అంతర్జాతీయ సంస్థలు ఆశ వర్కర్ల సేవలను గుర్తించి వివరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సరైన గుర్తింపు గౌరవాన్ని కల్పించడం లేదని విమర్శించారు. నిర్దిష్టమైన పనిగంటలు లేకుండానే ఏపీ జాతులు చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

మహిళా శ్రామికులైన ఆశ వర్కర్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చులకనగా చూస్తుందని పేర్కొన్నారు. ఆశ వర్కర్లు లేకపోతే గ్రామీణ ప్రాంత వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోతాయని తెలిపారు. కార్మిక హక్కుల్ని ఆరించడంలో కార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగించడంలో కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒకే విధమైన వైఖరిని ప్రజలు చేస్తున్నారని విమర్శించారు.  రిటైర్మెంట్ బెనిఫిట్స్ చనిపోతే అంత్యక్రియలు ఖర్చు ప్రమాదమేమన సౌకర్యం కల్పించాలన్నారు.

భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహాసభల ప్రారంభ సూచకంగా సిఐటి జెండాలు ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ మహాసభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు.

గత మూడు సంవత్సరాల కాలంలో ఆశ వర్కర్లు నిర్వహించిన పోరాటాలు సాధించిన విజయాలను జిల్లా కార్యదర్శి రాజశ్రీ మహాసభ ముందు ఉంచారు. జిల్లా మహాసభకు జిల్లా అధ్యక్షురాలు ఇందిరా అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా నా యకులు రాజనర్సు, అరుణ్ కుమార్, వీర య్య, మోహన్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.