11-10-2025 12:34:22 AM
ప్రారంభించిన మాజీ మేయర్ అజయ్ యాదవ్
మేడిపల్లి,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 10 కోట్ల నిధులతో 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ ప్రాజెక్టు మూడో డివిజన్ సాయి రెసిడెన్సి నుండి 28వ డివిజన్ బంగారు మైసమ్మ గుడి వరకు హెచ్ఎండిఏ 10 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించా మని తెలిపారు.
అభివృద్ధి కోసం సహకరించినటువంటి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ పూర్తి సాయ సహకారాలు అందించారని, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సుమన్ నాయక్, చీరాల నరసింహ, రాములు పులకల జంగారెడ్డి మాజీ కో ఆప్షన్ నెంబర్ రంగ బ్రహ్మన్న గౌడ్, కుర్రి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు