11-10-2025 12:33:02 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఖాతాదారుల వినతి
కరీంనగర్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): నగరంలోని పోస్ట్ ఆఫీస్ భాగ్యనగర్ శాఖను తరలించవద్దని ఖాతాదారులు కోరారు. ఈ మేరకు శుక్రవారం హరిహర సేవా సంఘం ఆధ్వర్యంలో ఖాతాదారులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. భాగ్యనగర్ శాఖను రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటకు తరలిస్తున్నారని, ఖాతాదారుల ఇబ్బందులు దృష్ట్యా శాఖ తరలింపును చర్యలు తీసుకోవాలనికోరారు.