09-12-2024 12:00:00 AM
పురుషుల సింగిల్స్ విజేత సతీశ్
న్యూఢిల్లీ: గౌహతి మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను భారత ద్వయం అశ్విని చేజెక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో అశ్విని జోడీ 21 21 లి జువాంగ్ జి మెంగ్ (చైనా) జంటను ఓడించింది. 43 నిమిషాల్లో ముగిసిన పోరులో అశ్విని జోడీ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. గతేడాది కూడా ఈ జోడీ గౌహతి మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక పురుషుల సింగిల్స్ విజేతగా భారత షట్లర్ సతీశ్ కరుణాకరన్ నిలిచాడు. ఫైనల్లో సతీశ్ 21 21 చైనాకు చెందిన జు చెన్‌ను ఓడించి టైటిల్ అందుకున్నాడు. భారత రైజింగ్ స్టార్ అన్మోల్ ఖర్బ్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 13 19 చైనాకు చెందిన కాయ్ యాన్ చేతిలో ఓటమితో రన్నరప్‌కు పరిమితమైంది.