09-12-2024 12:00:00 AM
* ఫైనల్లో యువ భారత్ ఓటమి
దుబాయ్: ఆదివారం భారత్‌కు ఏమాత్రం కలిసి రాలేదు. క్రికెట్‌లో అన్ని ఓటములే ఎదురయ్యాయి. పురుషుల క్రికెట్‌లో ఆస్ట్రేలియా చేతిలో రోహిత్ సేన ఓటమి చవిచూడగా.. అటు మహిళల క్రికెట్‌లో హర్మన్ సేనకు పరాజయం ఎదురైంది. ఇక అండర్ ఆసియా కప్ ఫైనల్లోనూ యువ భారత్‌కు ఓటమే ఎదురైంది. ఆదివారం దు బాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. రిజాన్ హొస్సన్ (47) రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా బ్యాటిం గ్‌లో విఫలమై 35.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో ఇ క్బాల్ ఎమన్, అజిజుల్ హకిమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన బంగ్లా టైటిల్‌ను నిలబెట్టుకుంది.