calender_icon.png 12 September, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంగ్లండ్‌దే టెస్టు సిరీస్

09-12-2024 12:00:00 AM

వెల్లింగ్‌టన్: న్యూజిలాండ్‌కు వారి సొంతగడ్డపైనే ఇంగ్లండ్ గట్టి షాక్ ఇచ్చింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 2 కైవసం చేసుకుంది. వెల్లింగ్‌టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ కివీస్‌పై 323 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ ముందు 582 పరుగుల భారీ లక్ష్యం ఉంచగా.. ఛేదనలో కివీస్ 259 పరుగులకే ఆలౌటై ఓటమిని మూటగట్టుకుంది. అంతకముందు ఇంగ్లండ్ స్టార్ జోరూట్ టెస్టుల్లో 36వ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కివీస్ బౌలర్లలో సౌథీ, హెన్రీ చెరో 2 వికెట్లు తీశారు.