calender_icon.png 11 September, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో వన్డేలోనూ భారత్ ఓటమి

09-12-2024 12:00:00 AM

122 పరుగుల తేడాతో ఆసీస్ విక్టరీ

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టుకు ఓటమి ఎదురైంది. బ్రిస్బేన్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్ సేనపై ఆసీస్ జట్టు 122 పరుగుల తేడా తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. జార్జి యా (87 బంతుల్లో 101), ఎలిస్ పెర్రీ (75 బం తుల్లో 105) శతకాలతో విజృంభించారు. సైమా 3 వికె ట్లు పడగొట్టింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 44.5 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రిచా ఘోష్ (54), మిన్నూ మాని (46), రోడ్రిగ్స్ (43) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 4 వికెట్లతో ఆకట్టుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2 కైవసం చేసుకుంది.