20-09-2025 12:00:00 AM
బూర్గంపాడు, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : బూర్గంపాడు మండలంలో అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పినపాక పట్టి నగర్ గ్రామంలోని ఎంపీపీ స్కూల్ ను,అంగన్వాడి కేంద్రాన్ని, అంజనాపురం ఎంపీపీ స్కూల్ ను సందర్శించారు. ఎఎక్సెల్,ఎఎంఎల్,ఏఐ ను పరిశీలించి,విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు గురించి ప్రధానో పాధ్యాయునితో మాట్లాడారు.
అలానే అంజనాపురం ఎంపీపీఎస్ ను డీఈవో నాగలక్ష్మి, ఎంపీడీవో జమలారెడ్డి, ఎంఈఓ యదు సింహరాజు సందర్శించారు.విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు, ఉపాధ్యాయలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శంకర్,బాబురావు, పంచాయతీ సెక్రటరీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.