20-08-2025 01:46:41 AM
ఎగువన పడుతున్న భారీ వర్షాలకు మంగళవారం గోదావరి ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నది. భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద 36.30 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. భూపాలపల్లిలో జోరు వాన కురిసింది. జిల్లాలోని పలు మండలాల్లో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. సరస్వతి బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతున్నది.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంజేపీ గురుకుల భవనం సెల్లార్‌లోకి వరద నీరు చేరడంతో విద్యార్థులను అధికారులు ఇళ్లకు పంపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదలడంతోపాటు జోరుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీ వరద ఉధృతి పెరిగింది. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతున్నది. ఉద యం 8 గంటలకు 39 గేట్లు ఎత్తారు.