calender_icon.png 4 June, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వరావుపేట సుందరంగా ఉండాలి

31-05-2025 12:29:48 AM

ఎమ్మెల్యే ఆదినారాయణకు మంత్రి తుమ్మల సూచన

అశ్వరావుపేట మే 30 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణను రాష్ట్ర వ్య వసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం దమ్మపేట మండలం గండు గులపల్లి ఆయన నివాసంలో ఎమ్మెల్యే, మంత్రానీ కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు,సమస్యలను ఆయన మంత్రి తుమ్మల దృష్టికి తీసు కువెళ్లారు.

ఇతర మంత్రులతో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని సమస్యలు పరి ష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అశ్వారావుపేట నియోజకవర్గం సుందరంగా తీర్చిదిద్దాలని సెంట్రల్ లైటింగ్,రింగ్ రోడ్డు అంతర్గత రహదారులన్నీ త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతతో కూడిన పనులు చేయించాలని, పెద్దవాగు ప్రాజెక్టు నిధులు కేటాయిస్తామని, అంకమ్మ చెరువు ను కూడా సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణ లో అశ్వారావుపేట అభివృద్ధిలో ముం దుండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాసాని నాగప్రసా ద్,అచ్యుతరావు, తదితరులు ఉన్నారు.