calender_icon.png 12 September, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారలే

12-09-2025 06:59:34 PM

బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు

హుజురాబాద్,(విజయక్రాంతి):  ప్రభుత్వాలు మారిన ప్రజల బతుకులు మారలేదని బిజెపి పట్టణ అధ్యక్షుడు తుర్పడి రాజు ఆవేద వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైన గాంధీనగర్, బుడగ జంగం కాలనీ, మామిండ్ల వాడ, కింది వాడలో  వర్షానికి నీటా మునిగిన ప్రాంతాలలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వాలు మారుతున్న కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

ఇంట్లోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని, పిల్లలు స్కూల్ కి వెళ్లడానికి రోడ్డు లేక బురదలో దాటుకుంటూ ఇబ్బందికి గురవుతున్నారన్నారు. తక్షణమే వరద నీరు ముప్పు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు రాజకీయ నాయకులు వరద ముప్పు ప్రాంతాలని సందర్శించడం వెళ్లడం  మాత్రమే జరుగుతుందని, కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీ కాలువలు సక్రమంగా నిర్మించలేని అధికారులు. ప్రజల పన్నుల ద్వారా  రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని అది గుర్తెరిగి ప్రభుత్వం వ్యవహరించాలని అన్నారు. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.