calender_icon.png 15 September, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సౌకర్యం కోసమే ట్రైన్ల నిలుపుదల

15-09-2025 12:00:00 AM

ఎమ్మెల్యే హరీష్‌బాబు

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 14 (విజయక్రాం తి): కాగజ్‌నగర్  రైల్వే స్టేషన్ ఆదివారం ట్రైన్ నెం.12591 గోరఖపూర్- యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ రైలుకు నూతనంగా నిలుపుద ల ఇవ్వగా, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వా యి హరీష్ బాబు జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడు తూ  శుక్రవారం సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్,ఆదివారం యశ్వంత్పూర్ ఎక్స్‌ప్రెస్, మంగళవా రం పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, గురువారం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు కాగజ్‌నగర్‌లో హాల్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.

దసరా, దీపావళి ముందు ఈ రైళ్ల హాల్టింగులతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రభాకర్ గౌడ్, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, మాజీ కౌన్సిలర్ సింధం శ్రీనివాస్, అరుణ్ లోయ, చిలువేరు ప్రవీణ్, పవన్ బల్దేవ, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, మంజుల, పుష్పలత, చేరాల శ్రీనివాస్, దూగుంట రాజన్న, రమేష్, పెద్ది హరీష్, సంజీవ్, చందు, అశోక్ ఆర్య, విలా స్, సౌరబ్, సంతోష్, సాయి, అనిల్, అతిక్, పురుషోత్తం, అధర్వ పాల్గొన్నారు.