27-05-2025 10:40:35 PM
పెద్దపల్లి పట్టణంలో రంగపూర్, సబ్బితం ఎల్లమ్మ గుడిలో బంగారం చోరీ..
రెండు రోజులుగా రెచ్చిపోతున్న దొంగలు భయాందోళనలో ప్రజలు..
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి(Peddapalli)లో దొంగల హల్చల్ చేస్తున్నారు. దీంతో ప్రజలు బాబోయ్ దొంగలు అంటూ బెంబేలెత్తిపోతున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే పెద్దపల్లి పట్టణంలో అపార్ట్మెంట్ లో దొంగలు పడగా, పెద్దపల్లి మంథని ప్రధాన రహదారి పక్కనే ఉన్న రంగపూర్, సబ్బితం ఎల్లమ్మ గుడిలో బంగారాన్ని దొచుకెళ్ళారు. సోమవారం రాత్రి ఆలయంలోని ఉండి పగలగొట్టి పైసలు తీసుకొని హూండీని పక్కనే పడేశారు. అమ్మవారి విగ్రహంపైన ఉన్న బంగారం తొలగించారు. రెండు రోజులుగా రెచ్చిపోతున్న దొంగలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీస్ లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.