21-07-2025 10:53:55 AM
బట్వాన్పల్లిలో పోలీస్ కమ్యూనిటీ ప్రోగ్రాం
గుడుంబా సీజ్, బెల్లం పాకం ధ్వంసం
బెల్లంపల్లి రూరల్ సీఐ అనూక్
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): ప్రజలు జీవనాధారం కోసం గుడుంబా ఇతర మాదకద్రవ్యాలను ఆశ్రయిస్తే జీవితాలు నాశనం అవుతాయని బెల్లంపల్లి రూరల్ సిఐ అనుక్ అన్నారు. బెల్లంపల్లి మండలం బట్వానపల్లి గ్రామంలో సోమవారం పోలీసులు , అబ్కారి శాఖ కలసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా బట్వానపల్లి గ్రామంలో 31 టూ వీలర్లు,3 ఆటోలు,15 లీటర్ల గుడుంబా నాయిని లచ్చయ్య, దల్యా మల్వోతూ నుంచి లభించినగా సీజ్ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా ఈ తనిఖీలో దొరికిన 200 లీటర్ల బెల్లం పానకం ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీఐ అనుక్ మాట్లాడుతూ గుడుoబాను ఎవరూ తయారు చేయోద్దనీ, తాగోద్దన్నారు.
దానివల్ల ఆరోగ్యం నాశనం అవుతుందని చెప్పారు. అంతేకాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజగడం జరుగుతోందనీ, పిల్లలు చదువు కోకుండా సమాజంలో పనికిరాని వారు అవుతారన్నారు. అలాగే గంజాయి ని ఎవరూ సేవించడం, అమ్మడం, ట్రాన్స్పోర్ట్ చేయడం చట్టరీత్య నేరమన్నారు. యువత మత్తు పదార్థాలు బానిస అవ్వడం సమాజానికి ప్రమాదం అన్నారు. తల్లి దండ్రులు కొడుకుల ప్రవర్తనను గమనించిన వారిలో చెడు అలవాట్లకి దూరంగా ఉండేలాచూడాలన్నారు. అలాగే వాహనాలకు అన్నిరకాల డాక్యుమెంట్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. మైనర్లు driver చేయొద్దనీ, సైబర్ నేరాలు, మూడ నమ్మకలవల్ల జరిగే అనర్ధాలను ఆయన వివరించారు.ఈ ప్రోగ్రాం గురజాల ఎస్సై రమేష్, కన్నెపల్లి ఎస్సై భాస్కర్, భీమిని ఎస్ఐ విజయ్, బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్సై రాకేష్, ఏఎస్సై లు, హెచ్ సీ లు, కానిస్టేబుల్ పాల్గొన్నారు.