21-07-2025 10:49:52 AM
చర్ల, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem) చర్ల మండలం లోగల కేజీబీవీ పాఠశాల నందు ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిఇసి, ఎం పి హెచ్ డబ్ల్యు కోర్సు నందు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కేజీబేబీ స్పెషల్ ఆఫీసర్ ఆర్ భానుప్రియాంక తెలియజేశారు. అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని కోరారు. ఇంటర్ మీడియట్ కళాశాలలో బోధించేందుకు ఎకనామిక్స్ పోస్ట్ ఒకటి (అర్థశాస్త్రం) బోధించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులుగా 2025- 26 సంవత్సరముకు గాను పనిచేయుటకు మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నామన్నారు. అర్హత ఎం ఏ ఎకనామిక్స్, బిఈడి లో ప్రావీణ్యం పొంది ఉండవలెను. దరఖాస్తు చేసుకొనుటకు అభ్యర్థులు బయోడేటా తో పాటు సర్టిఫికెట్స్ జతచేసి చర్ల కేజీవీబీ కళాశాల నందు సమర్పించగలన్నారు. అభ్యర్థులను మెరిట్ లిస్టు ఆధారంగానే ఎంపిక జరుగుతుందని, పూర్తి వివరాలు కేజీబీవీ చర్ల కళాశాలలో తెలుసుకోవాలన్నారు.