calender_icon.png 21 July, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా మహా సభలను విజయవంతం చేయాలి

21-07-2025 10:47:53 AM

మత్స్య కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం శ్రీను

హుజూర్ నగర్: మత్స్య కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం శ్రీను అన్నారు.ఆదివారం పట్టణంలోని అమర వీరుల స్మారక భవనంలో మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు...తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా 3వ మహాసభలు ఈనెల 23న హుజూర్ నగర్ లో నిర్వహిస్తున్నామని మత్స్యకారులు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.ప్రభుత్వం మత్స్యకారులకు 6లక్షల ఎక్స్ గ్రేషియో, 5 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను మత్స్యశాఖ పరిధిలోకి తేవాలని ప్రతి మత్స్యకారుడికి ద్విచక్ర వాహనాలు, మొబైల్ మార్కెటింగ్ వాహనాలు ఇవ్వాలని అధికంగా పెంచిన చెరువులు, కుంటలు లీజులను తగ్గించాలని, కబ్జాలకు గురవుతున్న చెరువులు కుంటల సమస్యలతో పాటు అనేక డిమాండ్లపై పోరాటాలు నిర్వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు నాగారపు పాండు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పల్లె వెంకటరెడ్డి,మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, చింతకాయల మల్లయ్య,శీలం సాంబయ్య,ఇంటి తిరపయ్య,పంగ వెంకటి, కనకమ్మ,శీలం యశోద,చింతకాయల యశోద, పాల్గొన్నారు.