20-07-2025 12:00:00 AM
కమలదళంతో శివరాజ్‌కు స్ట్రాంగ్ బాండింగ్
న్యూఢిల్లీ, జూలై 19: ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్న శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బీజేపీ అధ్యక్ష పదవి వరించనుందని జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా కూడా శివరాజ్ సింగ్ సేవలందించారు. నిఖార్సయిన బీజేపీ కార్యకర్తలతో శివరాజ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. పలువురి పేర్లు పరిశీలించిన అధిష్టానం శివరాజ్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలపై మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రచారంపై పెదవి విప్పారు. ‘ఈ విషయంలో నేను పార్టీ చెప్పిందే పాటిస్తాను. బీజేపీకి నేను విధేయుడిని. నిజాయతీ, నిబద్ధతతో పార్టీ నాకు అప్పగించిన విధులు నిర్వర్తించాను.
ఇకపై కూడా పార్టీ అప్పగించిన పనిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను’ అని పేర్కొన్నారు. ‘నేను 4 సార్లు ముఖ్యమంత్రినయ్యాను, 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పని చేస్తున్నాను. దేని గురించి ఆలోచించుకుంటూ కూర్చొని ఉండను’ అని తెలిపారు.