calender_icon.png 10 November, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడి చేసిన నిందితుడి అరెస్ట్

10-11-2025 10:14:48 PM

సిద్దిపేట క్రైమ్: ఈ నెల 5న మందపల్లి శివారులోని డీఎక్స్ఎన్ కంపెనీ సమీపంలో మెట్పల్లి గ్రామస్తుడు కుంచెం రవిపై దాడికి పాల్పడిన మందపల్లి గ్రామస్తుడు పన్యాల గాంధీరెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సిద్దిపేట టూటౌన్ ఇంచార్జి ఇన్స్పెక్టర్  వాసుదేవరావు తెలిపారు. రవి ట్రాక్టర్ లో రాళ్లను తరలిస్తుండగా, గాంధీరెడ్డి అడ్డుకొని కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డాడని బాధితుడు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం గుండ్లపల్లి టోల్ ప్లాజా వద్ద  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత దాడులు,  చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.