calender_icon.png 10 November, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుపై రైతు సదస్సులు

10-11-2025 10:13:33 PM

పాక్స్ సీఈఓ నిమ్మల ఆంజనేయులు 

నకిరేకల్ (విజయక్రాంతి): ఈనెల 11 నుండి 15 వరకు శాలిగౌరారం మండల పరిధిలోని శాలిగౌరారం, ఆకారం, శాలిలింగోటం, అడ్లూరు, తిరుమలరాయినిగూడెం తదితర గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపు పై సదస్సులు  ఏర్పాటు చేయనున్నట్టు పాక్స్ సీఈవో నిర్మల ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల వారిగా రైతు సదస్సులు  నిర్వహించబడతాయని ఈ సదస్సులకు రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ తాళ్లూరి మురళి, మానిటింగ్ ఆఫీసర్(డిసీవో)డి నాగేశ్వరరావు, ప్యాక్స్ సీఈఓ నిమ్మల ఆంజనేయులు,పవన్, నరేందర్,రామకృష్ణ,సౌమ్య శృతి, శ్రవణ్ కుమార్,మాదాసు ఝాన్సీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.