10-11-2025 10:16:05 PM
సిద్దిపేట క్రైమ్: బీసీ రిజర్వేషన్ల సాధన సమితి, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీల ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించే బీసీ ఆక్రోశ సభ కరపత్ర ఆవిష్కరణ జరిగింది. స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోయిని సదన్ మహారాజ్, భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకుడు చక్రధర్ గౌడ్, బీసీ నాయకులు శివ గౌడ్, బీసీ, ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు రవిబాబు, రాజు, ప్రసన్న, చందు, డీఎస్యూ జిల్లా కన్వీనర్ యాదగిరి, విష్ణు పాల్గొన్నారు.