13-08-2024 05:15:08 PM
రాజన్నసిరిసిల్ల: జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. సిరిసిల్ల పట్టణం పెద్దూర్ మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ డీఎస్పీ ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పాఠశాలలో పలు రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలో తనిఖీలు చేపడుతున్నట్లు వాటిలో భాగంగానే సిరిసిల్ల జిల్లాలో సోదాలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఏపీ అధికారులు పేర్కొన్నారు.