calender_icon.png 25 August, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూఎన్ఓలో భారత శాశ్వత సభ్యత్వానికి మోకాలడ్డుతున్న చైనా, పాక్

13-08-2024 05:54:59 PM

UNO: ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను పరిష్కరించాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్ పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీకి శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. భద్రతా మండలిని విస్తరించాలని, అందులో ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ దేశాలకు సభ్యత్వం కల్పించాలని సూచించింది. కాగా ఈ ప్రతిపాదనను చైనా, పాకిస్తాన్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. శాంతి భద్రతలపై ఐరాసలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో భారత ప్రతినిధిగా ఆర్. రవీంద్ర భారత దేశం తరఫున ప్రసంగించారు.