calender_icon.png 25 August, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసీ చట్టబద్ధ దోపిడీ చేస్తోంది

25-08-2025 01:34:34 AM

  1. బీహార్‌లో ఎస్‌ఐఆర్ ద్వారా ఓట్ల చోరీకి యత్నం
  2. ‘ఓట్ అధికార్ యాత్ర’లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
  3. రేపు యాత్రలో పాల్గొననున్న ప్రియాంక గాంధీ
  4. యాత్రలో బయటపడ్డ భద్రతా వైఫల్యం

పాట్నా, ఆగస్టు 24: భారత ఎలక్షన్ కమి షన్ (ఈసీ) చట్టబద్ధంగా ఓట్లను దోపిడీ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన చేపట్టిన ‘ఓట్ అధి కార్ యాత్ర’ ఆదివారంతో 13 రోజులు పూ ర్తయింది. యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఈసీపై మరోసారి విమర్శల దాడి చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పా టు చేసిన రాహుల్ గాంధీ ఈసీపై ఆరో పణల వర్షం కురిపించారు.

‘బీహార్‌లో ఎస్‌ఐఆర్ ఓట్ల చోరీకి చట్టబద్ధమార్గం. ఓటర్ల జాబితా నుంచి లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. ఓట్ల గల్లంతుపై ప్రతిపక్షం ఫిర్యాదు చేస్తున్నా.. అధికార బీజేపీ కూటమి మాత్రం నిశబ్ధంగా కూర్చొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, బీజేపీ మధ్య పొత్తు ఉంది అందుకోసమే బీజేపీ చూసీచూడ నట్టు వ్యవహరిస్తోంది’ అని విమర్శించారు.

‘బతికున్నా కొందరు చనిపోయినట్టు ఈసీ జాబితాలో పేర్కొంది. బీహార్‌లో అటువంటి వారిని గుర్తించేందుకు కృషి చేస్తున్నాం. పిల్లలు కూడా ‘ఓట్ చోర్, గద్దీ చోడ్’ అని నినదిస్తున్నారు. ఈసీఐ పిల్లలతో తప్పని సరిగా మాట్లాడాలి’ అని వ్యాఖ్యానించారు. 

రేపు యాత్రలో పాల్గొననున్న ప్రియాంక గాంధీ

వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ‘ఓటర్ అధికార్’ యాత్రలో పాల్గొననున్నారు. ఆదివారంతో ఈ యాత్ర 13 రోజులు పూర్తి చేసుకుంది. సుపాల్‌లో ప్రియాంక రాహుల్ గాంధీతో పాల్గొననున్నారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. ‘26, 27 తేదీల్లో ప్రియాంక గాంధీ బీహార్‌లో జరుగుతున్న ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొంటారు’ అని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా యాత్రలో పాల్గొననున్నారు. ఆదివారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాహుల్ యాత్రలో పాల్గొని ఆయనతో కలిసి నడిచారు. ససారంలో ప్రారంభమైన ఓటర్ అధికార్ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ తేజస్వీ యాదవ్‌తో కలిసి బైక్ నడిపారు. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి రాహుల్ గాంధీ బుగ్గపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. త్వరలోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

ఈ సూచన నాకూ వర్తిస్తుంది

పెండ్లి విషయంలో రాహుల్ సరదా వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన పెళ్లి విషయంలో సరదా వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌తో పెండ్లి విషయమై మాటామంతీ కొనసాగుతోందదన్నారు. బీహార్‌లోని అరారియాలో నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, రాహుల్ గాంధీ మధ్య ఈ సంభాషణ సాగింది.

సమావేశంలో తేజస్వీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి చిరాగ్ పాసవాన్ ఇక పెళ్లి చేసుకోవాలంటూ వ్యంగ్యంగా సూచించారు. ఈ క్రమంలోనే పక్కనే కూర్చున్న రాహుల్ గాంధీ, మైక్ అందుకుని.. ‘ఈ సూచన నాకూ వర్తిస్తుంది’ అని కామెంట్ చేశారు. ‘ఇదే విషయాన్ని మా నాన్న ఎప్పటినుంచో చెబుతున్నారు కదా’ అని తేజస్వీ బదులిచ్చారు. ‘అవును.. ఈ విషయమై ఆయనతో చర్చలు కొనసాగుతున్నాయి’ అని రాహుల్ బదులిచ్చారు.