23-11-2025 07:26:13 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో మహిళ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ చీరలు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం కోటి మహిళా శక్తి చీరలను పంపిణీ చేసినట్టు తెలిపారు. సమాజంలో మహిళల గౌరవం ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల పథకం అని వెల్లడించారు. మొదటి విడత నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతంలో పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.