calender_icon.png 24 September, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ నిమర్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న అరెల్లి కిరణ్ గౌడ్

24-09-2025 06:30:12 PM

మంథని,(విజయక్రాంతి): మండలంలోని  సూరయ్యపల్లిలో బతుకమ్మ నిమర్జనంలో మహిళా మణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారి సౌకర్యార్థం మాజీ వార్డు సభ్యుడు, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జ్ అరెల్లి కిరణ్ గౌడ్ సొంత నిధులతో నిమజ్జన ఏర్పాట్లు చేశాడు.  బుధవారం గ్రామంలో పర్యటించి బతుకమ్మ నిమజ్జనం చేసే పలు చోట్ల లైట్లు ఏర్పాటు చేశాడు. గ్రామం నుండి  రచ్చపల్లి కి వెళ్లే దారిలో వాగు వద్ద ఐమాక్స్ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయించి, రోడ్లు క్లీనింగ్ చేయించి, మంథనికి వెళ్లే దారిలో జనగలంతా వాగు వద్ద ఐమాక్స్ ఫ్లడ్ లైట్స్, ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి రోడ్లు క్లీనింగ్ పనులను దగ్గరుండి చేయించి పర్యవేక్షించాడు.

బతుకమ్మల నిమజ్జనానికి సౌకర్యాలు కల్పిస్తున్న పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి అరెల్లి కిరణ్ గౌడ్ కు గ్రామానికి చెందిన మహిళ లు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి చెందిన యూత్ సభ్యులు అభినందించారు. కిరణ్ గౌడ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో సురయ్యపల్లి గ్రామాన్ని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాట టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు ఆధ్వర్యంలో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు తో పాటు గ్రామాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకు వెళ్తానని కిరణ్ గౌడ్ తెలిపారు.