24-09-2025 06:24:58 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): ఢిల్లీలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఆక్టివిటీస్(నిఫా) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఒకటో డివిజన్, తీగల గుట్టపల్లి తాజా మాజీ కార్పొరేటర్, నిఫా రాష్ట్ర సెక్రటరీ కోలగని శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లో వివిధ జిల్లాలలో నుండి అధిక సంఖ్యలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినందుకుగాను నిఫా తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ కోలగాని శ్రీనివాస్ కి అవార్డు దక్కింది.
ఈ సందర్భంగా కోలగని శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తదానం ఒకరికి జీవితాన్ని ప్రసాదిస్తుందనే భావనతో అనేక జిల్లాల్లో రక్తదాన శిబిరాలను అత్యధికంగా చేపట్టడం జరిగిందని తెలిపారు. అన్ని దానాల్లో కన్నా రక్తదానం ఓ మహత్తర కార్యక్రమమని , అలాంటి కార్యక్రమాల్లో తాను భాగస్వామ్యం కావడం , ఈ సేవకు అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు.