calender_icon.png 25 August, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిపిసిసి అధ్యక్షుడిపై బీజేపీ ఆగ్రహం

25-08-2025 05:28:24 PM

ఎల్లారెడ్డిపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌పై టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి మండల అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి నేతృత్వం వహించారు.మహేష్ కుమార్ గౌడ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత యాత్రను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.