12 May, 2026 | 5:22 AM

యూరియా కోసం వెళ్తుండగా తిరగబడ్డ ఆటో

17-09-2025 02:07 PM

ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆటోలో యూరియా బస్తాల కోసం వెళ్తుండగా పల్టీకొట్టడంతో ముగ్గురు రైతులు తీవ్రంగా గాయపడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) బయ్యారం మండలం కంబాలపల్లి వద్ద బుధవారం జరిగింది. మండలంలోని గొరిమిళ్ళ గ్రామానికి చెందిన బోడ లక్ష్మి, వజ్జ సూరమ్మ, బోడ కిషన్ తో పాటు మరికొందరు ఆటోలో ఉప్పలపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఇస్తున్న యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో కంబాలపల్లి శివారు చిన్నవాగు సమీపంలో పల్టీ కొట్టిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మి, సూరమ్మ, కిషన్ తో పాటు మరికొందరిని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.