17-09-2025 01:55:12 PM
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానం చేసిన బిజెపి శ్రేణులు..
తాండూరు (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూర్ పట్టణంలో బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళికాదేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలిగి దేశ ప్రజలకు సేవలు అందించేలా చూడాలని... ప్రపంచంలో భారత దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టేందుకు మోడీకి సర్వశక్తులు ఇవ్వాలని ఆ కాళికాదేవిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం భారీగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి, బీజేవైఎం మహిళా మోర్చా, బీసీ మోర్చా, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు భారీగా పాల్గొన్నారు.