ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
మందమర్రి, (విజయక్రాంతి): భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi birthday) జన్మదిన వేడుకలు బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని యాపల్ శివ కేశవాలయంలో బుధవారం నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు రామటెంకి దుర్గారాజు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు.
పేదరిక నిర్మూలన కోసం, నిరుపేదల అభివృద్దే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. గత కరోనా కాలం నుండి దేశ వ్యాప్తంగా నిరుపేదలకు ఉచిత రేషన్ పంపిణీ చేయడంతో పాటు దేశ అభివృద్ధిలో కీలకమైన రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత కేంద్రంలోని బిజెపి, మోడీ ప్రభుత్వానికి దక్కు తుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారం చేపడుతుంద ని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లె పల్లెనా కాషాయ జెండా రెపరెప లాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కొలేటి శివప్రసాద్,బూత్ అధ్యక్షులు అశోక్, ప్రసాద్, చంద్రమౌళి, సదానందం లు పాల్గొన్నారు






