calender_icon.png 31 October, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఆటో- ఆర్టీసీ బస్సు ఢీ

31-10-2025 02:56:35 PM

ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఆటో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు  హైదరాబాద్ నుండి వనపర్తి వెళ్లే క్రమంలో నాగర్ కర్నూల్ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే ఆటో డ్రైవర్  బిజినపల్లి నుండి వట్టెం వైపు వెళ్తున్న క్రమంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటో డ్రైవర్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఆటో డ్రైవర్ను స్థానికులు వెంటనే 108 సాయంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.