calender_icon.png 31 October, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి నియామకం

31-10-2025 02:49:04 PM

ఆరు గ్యారంటీల అమలు బాధ్యతలు సుదర్శన్ రెడ్డికి అప్పగింత.

సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు.

హైదరాబాద్: మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పదవులు దక్కాయి. బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డిని(MLA Sudarshan Reddy) ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారుఆరు గ్యారంటీల అమలు బాధ్యత సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. జిల్లా కలెక్టర్లు, శాఖల కార్యదర్శులు, సంబంధిత ఇతర అధికారులతో అన్ని ప్రధాన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలును ఆయన సమీక్షిస్తారు. మంత్రులకు ఉండే సదుపాయాలన్నీ సుదర్శన్ రెడ్డికి కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 


అతను అన్ని క్యాబినెట్ సమావేశాలకు(cabinet meetings) ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటాడు. ప్రధాన సంక్షేమ, అభివృద్ధి పథకాల విభాగానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి స్థాయి అధికారి నాయకత్వం వహిస్తారు. సలహాదారునికి సెక్రటేరియల్ సహాయం అందిస్తారు. అన్ని ప్రధాన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై ఈ విభాగం ఎప్పటికప్పుడు మంత్రివర్గానికి తెలియజేస్తుందని ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. ప్రభుత్వం ఎమ్మేల్యే ప్రేమ్ సాగర్ రావుని(MLA Prem Sagar Rao) తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమించింది.