calender_icon.png 1 November, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడబిడ్డల వివాహాలకు అండగా కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం

31-10-2025 08:11:48 PM

సిద్దిపేట రూరల్: సమాజ సేవలో భాగంగా ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తున్న మున్సిపల్ కౌన్సిలర్, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు, జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మవరం బ్రహ్మం, మాజీ కౌన్సిలర్ ధర్మవరం స్వప్నతో కలిసి, రావూరుకుల గ్రామానికి చెందిన కొమ్ము భవాని,కనకయ్య దంపతుల కుమార్తె దివ్య శ్రీ వివాహానికి పూస్తే మట్టెలు, గాజులు అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మం మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన వధువుల వివాహాలకు అవసరమైన పూస్తే, మట్టెలు, చీరలు, గాజులు అందజేయడం కొనసాగుతుందని తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ కవిత-రవీందర్, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీధర్ రెడ్డి బ్రహ్మం కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.