calender_icon.png 31 October, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కల్వల ప్రాజెక్టును వెంటనే మరమ్మతు చేయాలి...

31-10-2025 03:02:05 PM

ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించాలి.

 రైతు, మత్స్యకారులకు అండగా నిలుస్తా..

ఎకరాకు 50 వేల నష్టపరిహారం అందించాలి..

జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత..

హుజురాబాద్,(విజయక్రాంతి): కల్వల ప్రాజెక్టును వెంటనే మరమ్మత్తు చేయాలి, కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లు స్పందించి కల్వల ప్రాజెక్టు మరమ్మత్తు పనులు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు(Telangana Jagruthi president) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలంలోని, కాచాపూర్ గ్రామం శివారులో మేచినేని శ్రీనివాసరావు వరి పంట మొoథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు నేల వాడడంతో పరిశీలించి, కల్వల ప్రాజెక్ట్ గండిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో  ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... కల్వల ప్రాజెక్టు 2 సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పడి ప్రాజెక్టులో నీటి నిల్వ లేక వీణవంక మండలంలోని 10 గ్రామాల రైతులు సాగునీరందక పంటలు ఎలా పండించాలో వేసిన పంటలు ఎలా కాపాడుకోవాలని ఆందోళన చెందుతున్నారని, గద్దపాక కల్వల మత్స్య సహకార సంఘం కు చెందిన 80 కుటుంబాలు కల్వల ప్రాజెక్టు గండి పడడంతో జీవనోపాధి కరువైందని, కల్వల ప్రాజెక్టు మరమత్తు కోసం గతంలో 70 కోట్ల నిధులతో మంజూరు చేయుటకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసిందని, వెంటనే కలువల ప్రాజెక్టు మరమత్తు కోసం నిధులు విడుదల చేయించేందుకు కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యేలు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కలువల ప్రాజెక్టు ఎమ్మెల్యేలుమరమ్మత్తు చేయించేందుకు కృషి చేయాలని, మొంథా తుఫానుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు ప్రభుత్వం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, మండల అధ్యక్షురాలు సల్మా, కాచాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కొండ్ర రాజయ్య,  జాగృతి నాయకులు, రైతులు ,మహిళల తోపాటు తదితరులు పాల్గొన్నారు.