24-01-2026 09:11:30 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రతా మాపోత్సవాలలో భాగంగా శుక్రవారం కరీంనగర్-2 డిపోలో ప్రమాద రహిత డ్రైవర్ల అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హాజరై మాట్లాడుతూ... ప్రమాదాల నివారణకు డ్రైవర్లు ఇతర రోడ్డు వినియోగదారులను గమనిస్తూ డ్రైవింగ్ చేయాలని, డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ పురుషోత్తం మాట్లాడుతూ... ఈ ప్రమాద రహిత సర్వీసు గల డ్రైవర్లను ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రమాద రహిత డ్రైవింగ్ చేయాలని కోరారు. అనంతరం ప్రమాదరహిత డ్రైవర్లకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి శ్రీకాంత్ చక్రవర్తి, ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరి స్వామి, రీజనల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్ భూపతిరెడ్డి, పి మల్లేశం, పర్సనల్ ఆఫీసర్ జి సత్యనారాయణ, అకౌంట్స్ ఆఫీసర్ ఎ శంకరయ్య, డిపో మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.