24-01-2026 09:08:21 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ 14వ మహాసభలు నేటి నుండి 28 వరకు హైదరాబాద్ పట్టణంలో జరగనున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో శనివారం వాల్ పోస్టర్ ఆవిష్కరణ తోపాటు 2కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఐద్వా మండల నాయకులు ఎన్. సబిత చల్లగొండ అరుణ మాట్లాడుతూ... ఈనెల 25న హైదరాబాద్ బస్ భవన్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభకు మహిళలు వేలాదిగా తరలిరావాలి. ప్రతి గ్రామం నుంచి ఊరుకో బండి రావాలని వారు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఐద్వా జాతీయ మహాసభలు జరుగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా నుండి వేలాది మంది ప్రతినిధులు హాజరై మహిళల సమస్యలపై సమగ్ర చర్చలు జరిపి భవిష్యత్తులో మహిళల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ కోసం తీర్మానాలు, పోరాటాల కార్యక్రమాలు నిర్ణయించబడతాయన్నారు. ఇందుకు హైదరాబాద్ వేదిక కానుందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనిత్యం జరుగుతున్న ఈ అన్యాయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
నిందితులకు త్వరితగతిన శిక్షలు విధించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి" అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి చింతల యాదయ్య ఐద్వా మండల అధ్యక్షురాలు జి. నాగామణి, మండల ఉపాధ్యక్షురాలు అలివేలు, సహాయ కార్యదర్శి సునీత, దేవి, జానకి, మహేశ్వరి, సంధ్య, అనసూయ, పద్మ, భారతమ్మ, పార్వతమ్మ, విజయ, సుశీల, ఎల్లమ్మ, వాణి, కె. భారతమ్మ లలిత, కల్పన, అనిత తదితరులు పాల్గొన్నారు.