calender_icon.png 24 September, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్ ఇండియా పోటీలకు స్కై జిమ్ బాడీ బిల్డర్లు

24-09-2025 06:20:53 PM

బెల్లంపల్లి అర్బన్: మహారాష్ట్రలోని  నాగపూర్ లో అక్టోబర్ నెలలో జరగనున్న కోల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు బెల్లంపల్లి స్కై జిమ్ బాడీ బిల్డర్లు ఎంపికయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి సిఈఆర్ క్లబ్ లోఈ నెల 23 న జరిగిన సింగరేణి కంపెనీ  బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. సింగరేణి ఉద్యోగులైన జనగామ మొగిలి 75 కిలోల విభాగంలో పెసరి అర్జున్ 70 కిలోల విభాగంలో ప్రథమ స్థానం పొంది కోల్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు. అలాగే పులి శెట్టి కృష్ణ స్వామి  55 కిలోల విభాగంలో పాల్గొని ద్వితీయ స్థానం  పొందారు. వీరు గత కొన్ని సంవత్సరాలుగా స్కై జిమ్ లో శిక్షణ పొందుతున్నారు. కోల్ ఇండియా పోటీలకు ఎంపికైన వీరిని జిమ్ కోచ్ పన్నాల సదానందం, జిమ్ నిర్వాహకులు సిర్ర బాలకృష్ణ, జంబోజు చంద్రశేఖర్, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.