calender_icon.png 1 January, 2026 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కల పెంపకం, సంరక్షణపై దృష్టి పెట్టాలి

31-12-2025 01:37:56 AM

గరిడేపల్లి, డిసెంబర్ 30: నర్సరీలో మొక్కల పెంపకం సంరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని గరిడేపల్లి ఎంపీడీవో సరోజ కోరారు.మండలంలోని గరిడేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న నర్సరీని మంగళవారం ఆమె గ్రామ పంచాయితీ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని నర్సరీలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు.

కొత్తగా ఇచ్చిన లక్ష్యాల ప్రకారం మట్టిని తెప్పించి బ్యాగులలో నింపాలని సిబ్బందికి ఆదేశించారు.మొక్కల పెంపకం, సంరక్షణపై ఆమె సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీవో సురేష్,పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు,ఫీల్ అసిస్టెంట్ మేకపోతుల సరిత,బిల్ కలెక్టర్ సతీష్,గ్రామపంచాయతీ సిబ్బంది,నర్సరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.