10-01-2026 12:00:00 AM
కాళేశ్వరం, జనవరి 9 (విజయక్రాంతి): మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మహదేవపూర్ అటవీ శాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో చైనా మంజా వినియోగం, అమ్మకం, నిల్వపై విధించిన నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్జీవో చంద్రశేఖర్, ఎఫ్‌ఎస్వో ఆనం ద్, శ్రీలత ఎఫ్బీవో ఆధ్వర్యంలో నిర్వహించారు. చైనా మంజా వల్ల పక్షు లు, వన్యప్రాణులు, ద్విచక్ర వాహనదారులు మరియు ప్రజలకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.