calender_icon.png 11 January, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిపెడలో బార్ అండ్ రెస్టారెంట్ దగ్ధం

10-01-2026 12:00:00 AM

మరిపెడ, జనవరి 9 (విజయక్రాంతి) : మహబూబాద్ జిల్లా మరి పెడ మండల కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మరిపెడ పట్టణంలో ఉన్న సెవెన్ హి ల్స్ బార్ అండ్ రెస్టారెంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజాము న సెవెన్ హిల్స్ రెస్టారెంట్‌లో విద్యు త్ షార్ఠ్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి.

రోడ్డుపై వెళ్తున్న వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదు పు చేశారు. ఆలోపే రెస్టారెంట్‌లోని ఫర్నిచర్ మొత్తం దగ్ధమైందని, ఈ ఘటనలో రెస్టారెంట్‌లోని లిక్కర్, వి లువైన పేపర్లు, 50 లక్షల మేర భారీ ఆస్తి నష్టం జరిగినట్టు బార్‌షాప్ య జమాని నరేష్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి హాని జరగలేదు.