calender_icon.png 22 July, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల భవిష్యత్తుపై అవగాహన సదస్సు

21-07-2025 06:55:06 PM

నిర్మల్ (విజయక్రాంతి): "పిల్లల భవిత తల్లిదండ్రుల బాధ్యత" అనే అంశంపైన ప్రముఖ సైకాలజిస్ట్, పేరేంటింగ్ కోచ్ శ్రీ అడ్డిగ శ్రీనివాస్ సోమవారం విజయ హైస్కూల్(Vijaya High School)లో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యాభ్యాసంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, అధిక ఒత్తిడిని అధిగమించాలో, విజయానికి ఎలా సులువైన బాటలు చేసుకోవాలో, తల్లిదండ్రులు మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల ఆలోచన దృక్పథానికి ఎలా స్పందించాలో, వారితో ఎలా మెలగాలో అనే అంశంపై అవగాహన కల్పించారు. పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ వహించాలో పిల్లలు పాటించవలసినవి, పాటించకూడని విషయాలపై అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా పాఠశాల జనరల్ సెక్రెటరీ & డిస్ట్రిక్ట్ ఒలంపిక్ చైర్మన్ అయ్యన్నగారి భూమయ్య మాట్లాడుతూ.. పిల్లలు, పోషకులు, సైకాలజిస్ట్ చెప్పినటువంటి మంచి విషయాలను పాటిస్తూ భవిష్యత్తులో మంచి ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగాలని, ఉన్నత శిఖరాలకు చేరాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల వైస్ చైర్మన్ అంబా రాణి, ట్రెజరర్ ఆడేపు సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆమెడ కిషన్, పాఠశాల కరస్పాండెంట్ మంచిరాల నాగభూషణం, ప్రిన్సిపాల్ సామ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, పోషకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.