22-07-2025 05:35:00 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో మంగళవారం రోజున ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ కరీంనగర్ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం కొట్టే అంజలి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంనకు ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మల్లవ్వ, శారద మాట్లాడుతూ.. సమాజంలో మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, రానున్న రోజుల్లో మహిళలే కీలకం కానున్నారని, దేశంలో, రాష్ట్రంలో మహిళలకు కేటాయించిన అన్ని స్థాయిల రిజర్వేషన్లు అమలు చేయాలని, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సమానత్వం కావాలని ఎన్నో ఏళ్లుగా భారత జాతీయ మహిళా సమాఖ్య ఉద్యమాలు నిర్వహించిందని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు అన్ని విధాలుగా మహిళలను ముందుకు నడిపించేందుకు వారికి కేటాయించిన రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని పాలక ప్రభుత్వాలను వారు కోరారు.
రానున్న రోజుల్లో మహిళల హక్కుల కోసం పోరాడుతుందని, మహిళా సమాఖ్య బలోపేతం కోసం మహిళలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్. ఎఫ్. ఐ డబ్ల్యూ నాయకురాలులు బీర్ల పద్మ, కొట్టే అంజలి, భారతి, కదారి కావ్య, ఉప్పల శ్రీగుణ, నెల్ల మల్లీశ్వరి, బి.అర్చన, ఎస్.గంగప్రియ, టి.రేవతి, వి.శ్రీలత, మంగ, నిర్మల, రజిత, బి.శారద, జ్యోతి, సుజాత, లావణ్య, శంకరవ్వ, రాజవ్వ పాల్గొన్నారు.