21-07-2025 06:57:50 PM
ఎమ్మెల్యే కెపి.వివేకానంద్..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ఎల్లమ్మ తల్లి దయతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132-జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని మూడు గుళ్ల దేవాలయంలో నిర్వహించిన బోనాల జాతర ప్రత్యేక పూజల్లో బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలతో ప్రజలంతా ఐకమత్యంతో జరుపుకునే వేడుకలు బోనాలు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు కావడి చంద్రా రెడ్డి, గోపాల్ రెడ్డి, సత్తి రెడ్డి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు బల్వంత్ రెడ్డి పటేల్, సామల నర్సింహా రెడ్డి, పెద్ది మల్లేశం, మురళీ గౌడ్, నరహరి గౌడ్, నార్లకంటి నగేష్, బిక్షపతి గౌడ్, వీరా రెడ్డి, నాయకులు మధు రెడ్డి, నార్లకంటి శ్యామ్, ఆటో బలరాం, కుంట వేణు, శంకర్ రెడ్డి, నల్ల ప్రసాద్, నారాయణ, వేణు తదితరులు పాల్గొన్నారు.