23-01-2026 12:24:52 AM
పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ ఏ శైలజ
మేడిపల్లి, జనవరి 22 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ కమీషనర్ ఆదేశాల మేరకు గురువారం బోడు ప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ శైలజ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు చెత్త నిర్వాణ , తడి చెత్త,పొడి చెత్తగా వేరు చేయడంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూ టీ కమిషనర్ తడి, పొడి, హానికర చెత్త వ్యర్థాల వర్గీకరణ (వేస్ట్ సిగ్రగేషన్), తడి చెత్తను అదే ప్రదేశంలో ఎరువుగా మార్చే ప్రక్రియ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, మునిసిపల్ సిబ్బం ది, విద్యార్థులు పాల్గొన్నారు.