calender_icon.png 23 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నాప్.. ఇరువర్గాల మధ్య చిచ్చు!

23-01-2026 12:23:57 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఘటన 

తమకు సంబంధం లేదంటున్న కాంగ్రెస్ నేతలు

ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సరి కాదంటున్న ప్రజలు

బాధితులతో కలిసి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి 

మహబూబ్ నగర్, జనవరి 22 (విజయక్రాంతి): ఎన్నికలు ఏవైనా ప్రతిపక్ష అధికార పక్షాలకు కంటి నిండా కొనుక్కు లేకుండా చేసే సందర్భాలు కోకొలలు. జిల్లాలోని భూ త్పూర్ మండలం పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని బాధితుడు.. అలాంటి అవసరం లేదంటూ కొట్టి పారేస్తున్న అధికార పార్టీ నేతలు.. చెబుతున్న మాటలు తీవ్ర చర్చకు దారితీస్తున్నా యి. ఏమైనా ఈ ఘటన సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేసి నిజా నిజాలు వెలు గులోకి తీసుకురావాలని భూత్పూర్ మండ ల ప్రజలు చెబుతున్న మాట.

- ఘటనకు రాజకీయరంగు..

 భూత్పూర్ మండల పరిధిలోని మదిగట్ల గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తికి మంగళవారం సాయంత్రం ఓ కారు లో ఇద్దరు కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారని బాధితులు వెంకటేష్ గౌడ్ చెబుతున్న మాట. అధికార పార్టీ నేతలు సై తం అలాంటి అవసరం లేదంటూ కేవలం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఆరోపణలు చే స్తున్నారని ఆ పార్టీ చెబుతున్నారు. తనపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భూపతిరెడ్డి బలవంతంగా కారులో ఎక్కించుకొని ఎవరు లేని ప్రాంతానికి తీసుకువెళ్లి తీవ్రంగా దాడి చేశారని బాధితుడు వెంకటేష్ గౌడ్ జి ల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘ టనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బాధితులతో కలిసి జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రాజకీయ రంగు పులుముకుంది. 

- ఒక్కసారిగా ఊపందుకున్న చర్చ

 పుత్తూరులో జరిగిన ఈ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా చర్చకు దారి తీ సింది. అధికారమైనా ప్రతిపక్షమైనా దాడి జ రిగిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఇలాంటి అంశాలు చర్చకు రావడం శోచనీయమని ప్రజలు ప్రత్యేకంగా చెబుతున్న మాట. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీ స్ శాఖ ప్రత్యేకంగా దర్యాప్తు చేసి నిజాన్ని బహిర్గతం చేయాలని ప్రజలు పేర్కొనడం విశేషం. రాజకీయ కోణం అసలు లేదంటూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనుచరులతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు చెబు తున్న మాట.

కేవలం ఆరోపణలు చేయడమే వారి పనిగా పెట్టుకున్నారని ఇది సరైన పద్ధ తి కాదని అధికార పార్టీ నేతలు పలువురు చె బుతున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తిస్థాయిలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మున్సిపల్ ఎన్నికలతో పాటు జరగబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల వేళ మండల పరిధిలోని ఇలాంటి ఘటన చర్చకు రావడం మండల వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది. దాడి జరిగిందా జరగలేదా అనే విషయాలు అటువంటి అసలు ఈ అంశం తెరపైకి ఎందుకు వచ్చింది అని కోణాలలో జనం ప్రత్యేకంగా చర్చించుకుంటుండ్రు. ఈ చర్చకు ముగింపు పలకాలంటే పోలీసుల దర్యాప్తు పూర్తిస్థాయిలో చేసి నిజ నిజాలు చెబితేనే ఈ అంశా నికి ముందు పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తుంది.